1 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
2 నా దేవా నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
3 నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
4 నీవు నన్ను నిద్రపోనియ్యవు.
5 గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
6 రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
7 “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
8 దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
9 కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
11 యేహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
14 నీవు ఆద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు