1 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
16 ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడి పోతుంది.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
18 దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.