Miquéias 7

TEL2010

1 నేను కలత చెందాను! ఎందుకంటే, నేను సేకరించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను.

2 అనగా విశ్వసంగల జనులంతా పోయారు.

3 ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు.

4 వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు.

5 నీ పొరుగువానిని నమ్మవద్దు!

6 తన ఇంటివారే తనకు శత్రువులవుతారు.

7 కావున సహాయంకొరుకు నేను యెహోవా తట్టు చూస్తాను.

8 నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువూ, నన్ను చూచి నవ్వకు!

9 నేను యెహోవా పట్ల పాపం చేశాను.

10 నా శత్రువు ఇది చూసి సిగ్గుపడుతుంది.

11 నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది.

12 నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు.

13 దేశం పాడై పోయింది. దానిలో నివసించే జనులవల్ల,

14 కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు.

15 నేను నిన్ను ఈజిప్టు నుండిబయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరిపించాను.

16 అన్య జనులు ఆ అద్భుతకార్యాలు

17 వారు పాములా మట్టిలో పాకుతారు.

18 నీవంటి దేవుడు మరొకడు లేడు.

19 యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను పరిహరించు.

20 దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా ఉంటావు.

Ler em outra tradução

Comparar lado a lado