1 యెహోవాను స్తుతించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
5 యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
6 నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
7 దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
8 కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించ బడతావు.
9 యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాట బడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబతున్నాను.