1 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగల వారు ఒక్కరూ లేరు.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
10 దేవా, నీవు రహబును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వంనీదే.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
13 దేవా, నీకు శక్తి ఉంది!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
17 నీవే వారి అద్భుత శక్తివి,
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
30 అతని సంతతి వారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞాలను ఉల్లంఘించి,
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కానీ వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్ధానం చేసాను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
38 కానీ దేవా, ఏర్పరచబడిన నీ రాజు మీద నీకు కోపం వచ్చింది.
39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు.
40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు.
41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు.
42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు.
43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు.
44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు.
46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా?
47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము.
48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు.
49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ?
52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి.