1 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
2 నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
3 నీవే నా క్షేమ స్థానం.
4 నీ గుడారంలో నేను శాశ్వతంగా నివసిస్తాను.
5 దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
6 రాజుకు దీర్గాయుష్షు దయచేయుము.
7 అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
8 నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.