1 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము.
2 దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు.
3 ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసి కోలేదు.
4 నా దేవా, నీవు నా రాజువు.
5 నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు తోసివేసాము.
6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను.
7 దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు.
8 మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము!
9 కాని, దేవా, నీవు మమ్ముల్ని విడిచిపెట్టావు. నీవు మమ్ముల్ని ఇబ్బంది పెట్టావు.
10 మా శత్రువులు మమ్ముల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు.
11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్ముల్నిచ్చి వేశావు.
12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మి చేశావు.
13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్ముల్ని హాస్యాస్పదం చేశావు.
14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము.
15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను.
16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు.
17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు.
18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు.
19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్ముల్ని చితుక గొట్టావు.
20 మా దేవుని పేరు మేము మరచిపోయామా?
21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు.
22 దేవా, నీకోసం ప్రతి రోజూ చెంపబడుతున్నాము!
23 నా ప్రభువా, లెమ్ము!
24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు.
25 బురదలోకి మేము తోసివేయబడ్డాము.
26 దేవా, లేచి మాకు సహాయం చేయుము!