1 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
3 ఆయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కానీ ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.