Salmos 11

TEL2010

1 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?

2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.

3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?

4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.

5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.

6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.

7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado