Salmos 38

TEL2010

1 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు

2 యెహోవా, నీవు నన్ను బాధించావు.

3 నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.

4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని,

5 నేను తెలివి తక్కువగా ఉన్నాను.

6 నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.

7 నా నడుము వేడిగా కాలిపోతోంది.

8 నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.

9 ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.

10 నా గుండె తడబడచున్నది. నా బలం పోయింది.

11 నా రోగం మూలంగా నా స్నేహితులు,

12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.

13 అయితే నేను వినబడని చెవిటి వానిలా ఉన్నాను.

14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటి వానిలా నేను ఉన్నాను.

15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.

16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.

17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.

18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.

19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,

20 నా శత్రువులు నాకు కీడు చేస్తారు,

21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.

22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.

Ler em outra tradução

Comparar lado a lado