1 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి!
2 మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట
3 పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి.
4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని
5 మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి.
6 వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి.
7 నా మాటలు సత్యం.
8 నేను చెప్పే విషయాలు సరైనవి.
9 తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి.
10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది.
11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది.
12 “నేను జ్ఞానాన్ని,
13 ఒక మనిషి యెహోవాను గౌరవిసే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు.
14 కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను.
15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు.
16 భూమిమీద ప్రతీ మంచి పాలకుడూ తన కింద ఉన్న
17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను.
18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి.
19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి.
20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను.
21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను.
22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట
23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను.
24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను.
25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
26 యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను.
27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు
28 ఆకాశంలో యెహోవా మేఘాలను
29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు
30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు.
31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు.
32 “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి.
33 నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి.
34 ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు.
35 నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును
36 అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి