1 ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు సంబంధించి ఉన్నాయి.
2 ఈ వర్తమానం ఈజిప్టు దేశాన్ని గురించి చెప్పిబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నది తీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:
3 “మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి.
4 గుర్రాలను సిద్ధం చేయండి.
5 నేనేమిటి చూస్తున్నాను?
6 “వేగంగా పరుగెత్తేవారు,
7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు?
8 పొంగి ప్రవహించే నైలు నదిలా
9 గుర్రపు రౌతుల్లారా, యుద్ధానికి కదలండి.
10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు!
11 “ఈజిప్టు, గిలియాదు వరకు వెళ్లి మందు తెచ్చుకో.
12 నీ రోదనను దేశాలు వింటాయి.
13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్తమానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం ఇవ్వబడింది.
14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి.
15 ఈజిప్టూ నీ బలమైన యోధులెందుకు చంపబడతారు?
16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు.
17 వారి స్వస్థలాల ఆ సైనికులు,
18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది.
19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి.
20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది.
21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు.
22 బసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే
23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు,
24 ఈజిప్టుకు తలవంపులవుతుంది.
25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనును నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను.
26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను.
27 “నా సేవకుడవైన యాకోబూ, భయపడవద్దు.
28 యెహోవా ఇలా అంటున్నాడు,