1 “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా?
2 యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా?
3 అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి.
4 తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి.
5 “యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు?
6 అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను).
7 అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు.
8 అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి.
9 “యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా?
10 యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా?
11 యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు
12 నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు
13 “నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది.
14 నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది.
15 ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని
16 నిప్పుకోడి తన పిల్లలను చూడదు.
17 ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు.
18 కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది.
19 “యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా?
20 యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా?
21 గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది.
22 భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది.
23 గుర్రం మీద అంబులపొది వణకుతుంది.
24 గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది.
25 బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓ హో’ అంటుంది.
26 “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా?
27 యోబూ, పక్షిరాజు ఎగరాలని,
28 పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది.
29 పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది.
30 పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి.