1 “ఉరుములు, మెరుపులు నన్ను భయపెడతాయి.
2 ప్రతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా ధ్వనిస్తుంది.
3 మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన మెరుపును పంపిస్తాడు.
4 మెరుపు మెరిసిన తర్వాత గర్జించే దేవుని స్వరం వినవచ్చును.
5 దేవుడు ఉరిమే స్వరం అద్భుతం.
6 ‘నేలమీద పడు’
7 దేవుడు ఏమి చేయగలడో అనేది
8 మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ నివసిస్తాయి.
9 తుఫాను దక్షిణం నుండి వస్తుంది.
10 దేవుని ఊపిరి మంచును చేస్తుంది.
11 దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు.
12 భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు.
13 దేవుడు మనుష్యులను శిక్షించేందుకు,
14 “యోబూ, ఒక నిమిషం ఆగి విను.
15 యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా?
16 ఆకాశంలో మేఘాలు ఎలా వేలాడుతాయో నీకు తెలుసా?
17 లేదు, యోబూ, ఈ సంగతులు నీకు తెలియపు.
18 యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు
19 “యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు.
20 నేను దేవునితో మాట్లాడాలని నేను ఆయనతో చెప్పను.
21 ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడలేడు.
22 (అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది.
23 సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా గొప్పవాడు.
24 అందువల్లనే మనుష్యులు దేవుని గౌరవిస్తారు.