1 “నా సేవకుణ్ణి చూడండి!
2 అతడు వీధుల్లో కేకలు వేయడు
3 అతడు సౌమ్యుడు అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు.
4 లోకానికి న్యాయం చేకూర్చేవరకు
5 యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)
6 “మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను.
7 గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు.
8 “నేను యెహోవాను.
9 కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను,
10 యెహోవాకు కొత్త కీర్తన పాడండి.
11 అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు
12 యెహోవాకు మహిమ ఆపాదించండి.
13 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు.
14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను.
15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను.
16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను
17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు.
18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి.
19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు ఎక్కువ గుడ్డివాడు.
20 ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి.
21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నారు.
22 అయితే ప్రజలను చూడండి
23 మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి.
24 యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించు కోలేదు.
25 అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించ లేదు.