1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు:
2 “నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా:
3 నీవు దానియేలు కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు!
4 నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు.
5 గొప్పదైన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్యారా నీ సంపదను పెంచావు.
6 “‘అందువల్ల నా ప్రభువైన యెహోవా చెపుతున్న దేమంటే,
7 అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను.
8 వారు నిన్ను సమాధిలోకి దించుతారు.
9 నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు.
10 కోత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపివేస్తారు.
11 యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు:
12 “నరపుత్రుడా, తూరు రాజను గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
13 దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు.
14 నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ ఒకడవై యున్నావు.
15 నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, యోగ్యుడిగా ఉన్నావు.
16 నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది.
17 నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు.
18 నీవు చాలా పాపాలు చేశావు.
19 ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని
20 యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
21 “నరపుత్రుడా, సీదోను పట్టణం వైపు చూడు. నా తరపున ఆ ప్రదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుము.
22 ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
23 రోగాలను, మరణాన్ని నేను సీదోనుకు పంపిస్తాను.
24 “‘గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే ముండ్లు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’”
25 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చాను.
26 వారు ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, ద్రాక్షాతోటలు పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొంటారు.”