Amós 6

TEL2010

1 సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలాసుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

2 మీరు వెళ్లి కల్నేలో చూడండి.

3 శిక్షా దినము బహు దూరాన ఉన్నదనుకొని,

4 కాని మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు.

5 మీరు స్వరమండలాలను వాయిస్తారు.

6 చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు.

7 ఆ ప్రజలు వారి పాన్పులపైన చాచుకొని పడుకున్నారు. కాని వారి మంచి రోజులు అంతమవుతాయి. వారు బందీలవలే అన్యదేశాలకు తీసుకొనిపోబడతారు. ముందుగా అలా పట్టుకుపోబడే వారిలో ఈ ప్రజలు వుంటారు.

8 నా ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:

9 ఆ సమయంలో ఒక్కానొక ఇంట్లో పదిమంది జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది మరిణించవచ్చు.

10 ఒక బంధవు ఆ శవాన్ని బయటకు తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు ఇంటినుంచి ఎముకులు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో దాగిన ఏ వ్యక్తినైనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా ఏమైనా శ వాలు మిగిలియా?” అని అడుగుతారు.

11 చూడు, దేవుడై న యెహోవా ఆజ్ఞ ఇవ్వగా,

12 గుర్రాలు బండలపై పరుగిడతాయా?

13 మీరు లో-దెబారులో సుఖంగా ఉన్నారు.

14 “కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను. ఆ రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. లేబో-హమాతు నుండి అరాబా వాగువరకూ మీ అందరికీ కష్టాలు వస్తాయి.” దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

Ler em outra tradução

Comparar lado a lado